OG Review : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ స్టైలిష్ యాక్షన్ & థమన్ మ్యూజిక్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ ఓజీ (OG). సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్, తేజ్ సప్రు, హరీశ్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అభిమన్యు సింగ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:
ఓజీ కథ ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది. పదేళ్ల తర్వాత ముంబై అండర్‌వర్ల్డ్‌లోకి తిరిగి వచ్చే ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్ పాత్రలో కనిపిస్తాడు. ఒక రాజును (ప్రకాష్ రాజ్) అతని సామ్రాజ్యాన్ని రక్షించడానికి ఓజీ మళ్లీ రంగంలోకి వస్తాడు. తన ప్రత్యర్థి ఒమి భాయ్ (ఇమ్రాన్ హష్మీ) తో జరిగిన పోరాటమే ప్రధాన కథ.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్: స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకుంటాయి.

దర్శకుడు సుజీత్: పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌ను ఫ్యాన్ బాయ్ లా అద్భుతంగా చూపించారు.

థమన్ సంగీతం: బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

యాక్షన్, విజువల్స్: హై-ఆక్టేన్ యాక్షన్, గ్రాఫిక్ సీన్‌లు, రిచ్ సినిమాటోగ్రఫీ.

ఇమ్రాన్ హష్మీ: విలన్ పాత్రలో బాగా నటించారు, సినిమాకు కొత్త రూపం తీసుకొచ్చారు.

మైనస్ పాయింట్స్:

కథనం: రొటీన్, పెద్దగా కొత్తదనం లేదు.

సెకండ్ హాఫ్: మొదటి భాగంతో పోలిస్తే నెమ్మదిగా సాగింది.

హింస: ఎక్కువ హింస, రక్తం ఉండటం వల్ల ‘A’ సర్టిఫికేట్; ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండవచ్చు.

హీరోయిన్ పాత్ర: పెద్ద ప్రాధాన్యత లేదు.

ఫైనల్ వెర్డిక్ట్:
మొత్తం మీద ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరిచే యాక్షన్ ఎంటర్‌టైనర్. మాస్, స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇష్టపడేవారికి ఇది పండగే.

Leave a Reply