నేటి కాలంలో గాఢమైన, మెరిసే జుట్టు అందరికి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకోసం చాలామంది షాంపూలను ఉపయోగిస్తారు. షాంపూలు జుట్టును శుభ్రం చేసి, మెత్తగా, కాంతివంతంగా చేస్తాయి. కానీ ప్రతిరోజూ షాంపూ వాడి తలస్నానం చేయడం వల్ల జుట్టుకు హాని కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం పెరిగి, పొడిగా మారే అవకాశముంది.
షాంపూ జుట్టును శుభ్రం చేసినా, ప్రతిరోజూ తలస్నానం చేయడం మేలు కాదు. దీని వల్ల జుట్టు తేమను కోల్పోతుంది, పెళుసుగా మారి రాలడం ప్రారంభమవుతుంది.
పొడి జుట్టు ఉన్నవారు వారానికి 1-2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. తరచుగా షాంపూ వాడడం వల్ల సహజ నూనెలు తొలగి జుట్టు పొడిగా మారుతుంది.
జిడ్డుగల స్కాల్ప్ ఉన్నవారు వారానికి 2-3 సార్లు తలస్నానం చేయవచ్చు. కానీ మూడు సార్లకంటే ఎక్కువ చేయకూడదు.
కర్లీ, మెలికలు తిరిగిన జుట్టు ఉన్నవారువారానికి 1-2 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు జుట్టు పొడిగా మారే అవకాశం పెంచుతాయి. జుట్టు ఆరోగ్యానికి హెయిర్ మాస్క్లు ఉపయోగపడతాయి.
గుడ్డు లేదా అరటిపండు కలిపి చేసిన మాస్క్ జుట్టును మృదువుగా, తేమగా చేస్తుంది.
అరటిపండు + అలోవెరా జెల్ పేస్ట్ చేసి జుట్టుకు లాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.
నిత్యం తలస్నానం చేసే అలవాటు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించడం ద్వారా తమ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.