Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్.. షాక్‌లో అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ఈరోజు ఆయనకు జ్వరం మరింత పెరిగింది. దీంతో వైద్యులను సంప్రదించగా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం. దీనితో ఆయన అధికారిక కార్యక్రమాలను 2-3 రోజులపాటు వాయిదా వేసుకున్నారు.

ఇటీవల పవన్ కల్యాణ్‌ చాలా బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో టైమ్ ఇవ్వకుండా పనిచేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, “ఓజీ” సినిమా ఈవెంట్లలో పాల్గొంటూ గడిపారు. “ఓజీ” ప్రీరిలీజ్ ఈవెంట్‌కూ జ్వరంతోనే హాజరైనట్టు తెలుస్తోంది. అభిమానులు మాత్రం ఇలా తడవడం వల్లే ఆయన ఫీవర్ బారిన పడ్డారని భావిస్తున్నారు. ఏదేమైనా, “ఓజీ” రిలీజ్ జోష్‌లో ఉన్న మెగా ఫ్యాన్స్‌కి పవన్ కల్యాణ్ అనారోగ్యం ఆందోళన కలిగిస్తోంది.

“ఓజీ” సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌కి అద్భుత స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ లుక్, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, సుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు.

Leave a Reply