దసరా (Dasara 2025) పండగ సందర్భంగా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (Executive) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,565 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులు, మహిళలు మాత్రమే కాకుండా మాజీ సైనికులకు కూడా రిజర్వేషన్ కల్పించారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 22, 2025
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 21, 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్ 22, 2025 (రాత్రి 11 గంటల వరకు)
దరఖాస్తు సవరణ: అక్టోబర్ 29 నుంచి అక్టోబర్ 31, 2025
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ 2025 లేదా జనవరి 2026
అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య.
రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
శారీరక కొలత పరీక్ష (PE & MT)
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 4,408
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 2,496
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [మాజీ సైనికులు – కమాండో]: 376
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [మాజీ సైనికులు – ఇతరులు]: 285
Delhi Police Constable Recruitment Notification Out.
Total VACANCIES :- 7565. pic.twitter.com/fTeIAzQBxb— Dr Gaurav Garg (@DrGauravGarg4) September 22, 2025
మొత్తం పోస్టులు: 7,565
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లోకి వెళ్లండి.
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ ఇమెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
అప్లికేషన్ ఫిల్ చేసి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
చివరగా ఫీజు చెల్లించి, అప్లికేషన్ సమర్పించండి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ అభ్యర్థులు: రూ.100
మహిళలు, SC, ST, మాజీ సైనికులకు: ఫీజు లేదు
ఫీజు చెల్లింపు: UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా.