యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు NHRC నోటీసులు.. వెబ్ సిరీస్ వివాదం

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ లో రణ్‌బీర్ కపూర్ ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఫిర్యాదు వెలువరించింది. ఈ సీన్ నిషేధిత వస్తువును ప్రోత్సహిస్తూ, యువతపై తప్పుడు ప్రభావం చూపుతుందని కమిషన్ పేర్కొంది.

ముంబైలోని వినయ్ జోషి అనే వ్యక్తి ఈ సీన్‌పై ఫిర్యాదు చేసి, 2019లోని ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం, ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, నిల్వ, పంపిణీ మరియు ప్రకటనలు నేరం. కానీ వెబ్ సిరీస్‌లో హెచ్చరికలు లేకుండా వేపింగ్ చూపించడం చట్ట ఉల్లంఘన అని ఫిర్యాదుదారు తెలిపారు.

NHRC స్పందిస్తూ, రణ్‌బీర్ కపూర్, వెబ్ సిరీస్ నిర్మాతలు, Netflix పై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీస్‌కు ఆదేశించింది. అలాగే, ఫిర్యాదు సంబంధించిన నివేదికను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఆదేశించింది. NHRC, ఇలాంటి కంటెంట్ యువతను తప్పుదారిలో పెట్టకుండా వెంటనే నిషేధం చేయాలని సూచించింది.

ఈ సీన్ వివాదం సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది, ప్రేక్షకులలో ఆందోళనను కూడా రేపింది.

Leave a Reply