Kavitha Vs Harish Rao: హరీష్ రావుపై నా కోపం ఇదే.. కవిత సంచలన ప్రెస్ మీట్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కూడా పార్టీ స్థాపనకు ముందే వందల మందితో చర్చలు జరిపారని, తాను కూడా ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తున్నానన్నారు.

తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతురు తానే అని. 2016లోనే ఇరిగేషన్ శాఖ విషయాలను కేటీఆర్‌కు అలర్ట్ చేశానని, కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ నిర్ణయించినదే అని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్‌లో తెలిపారు. కాబట్టి హరీష్ రావుపై తన కోపం కాళేశ్వరం విషయంలో మాత్రమే ఉందని, మరే విషయంలో లేదు అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని, కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనతో ఫోన్ ద్వారా సంప్రదించలేదని కూడా తెలిపారు. తాను కూడా కాంగ్రెస్ లో ఎవర్నీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ పదే పదే తన పేరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాకపోవడం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తున్నాడేమో అనే అనుమానం వ్యక్తం చేశారు.

కవిత చెప్పినట్లు, తాను ప్రజల కోసం పనిచేయాలని భావిస్తున్నానని, బీసీ ఇష్యూ తనకు దగ్గరగా ఉందని చెప్పారు. ప్రస్తుతానికి తాను ఫ్రీ బర్డ్, ద్వారాలు తెరిచే సిద్ధంగా ఉన్నాయని, చాలామంది నేతలు తనను కలుసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతల లిస్ట్ కూడా చాలా పెద్దదని తెలిపారు.

తమ స్వగ్రామం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను జరుపుకోవడంలో ప్రత్యేకత లేదని, కొన్నేళ్లుగా అక్కడే వేడుక జరుపుతున్నట్లు, ఈసారి కూడా స్వయంగా వారు ఆహ్వానించటంతో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక కార్యక్రమాలను నేటి కాంగ్రెస్ సర్కార్ వదిలేసిందని, అందులో బతుకమ్మ చీరల పంపిణీని కూడా నిలిపివేసిందని ఫైర్ అయ్యారు.

Leave a Reply