K-RAMP టీజర్‌లో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం.. నాన్‌స్టాప్ కిస్సింగ్స్‌తో బజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘K-RAMP’ టీజర్ ఇటీవల విడుదలై, యువతలో మంచి బజ్ క్రియేట్ చేసింది. సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. సినిమాలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం టీజర్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది.

టీజర్ బట్టి చూస్తే, సినిమా ఒక విభిన్నమైన ప్రేమకథగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ స్టోరీతో పాటు, డబుల్-మీనింగ్ డైలాగ్‌లు, బోల్డ్ కిస్సింగ్ సన్నివేశాలు యువతలో మరింత బజ్ క్రియేట్ చేశాయి. మొత్తం సినిమా కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించబడింది. కిరణ్ అబ్బవరం వాడిన కొన్ని డైలాగ్స్ కొత్తగా, విభిన్నంగా ఉన్నాయి.

‘K-RAMP’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18 నుండి థియేటర్లలో విడుదల కానుంది. విభిన్న కథాంశాలతో ముందుకు వెళ్తున్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమాతో మరో విజయాన్ని అందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ కూడా సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

Leave a Reply