OG Trailer : పవన్ కళ్యాణ్ ‘OG’ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ట్రైలర్ మోత మోగిపోతోంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG (They Call Him OG)” ట్రైలర్ విడుదలకు రోజులు దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఆతృత పెరిగిపోతోంది. ఇప్పటికే టీజర్, పాటలతోనే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్ వస్తే ఈ హైప్ మరింత రెట్టింపవుతుందనే నమ్మకం ఉంది.

సెప్టెంబర్ 21, 2025 ఉదయం 10:08 గంటలకు ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ స్పెషల్ ట్రెండ్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో హంగామా చేస్తున్నారు. ట్రైలర్ ద్వారా అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు నెరవేరతాయా అన్న చర్చ కూడా మొదలైంది.

దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, పవన్ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించబోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. ట్రైలర్‌తో సినిమా రేంజ్ మరింత పెరగనుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

అధికారిక రిలీజ్‌కి ముందే సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలోనే $1.75 మిలియన్ ప్రీ-సేల్స్ జరగగా, అందులో Cinemark అనే థియేటర్ చైన్‌లో ఒక్కదానిలోనే $1 మిలియన్ విలువైన టికెట్లు అమ్ముడవడం పవన్ కల్యాణ్ క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది.

ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. పవన్ లుక్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చాయి. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ టచ్ ఈ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా మారబోతోంది.

DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఉన్న బుకింగ్స్, ప్రీ-రిలీజ్ బజ్ చూస్తే, OG బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి OG సిద్ధంగా ఉంది.

Leave a Reply