ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ రూ.1000, అభిమానులకు షాక్..!

పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మోహన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మూవీ టికెట్ల ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నుండి అనుమతి పొందింది.

సెప్టెంబర్ 25 రాత్రి 1 గంటకు ప్రదర్శించబడే బెనిఫిట్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.1000గా నిర్ణయించబడింది. అలాగే సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 ధర నిర్ణయించబడింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు కృతజ్ఞతలు తెలిపింది.

ఇదిలా ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఓజీ మూవీ టికెట్ ధరలను పెంచినట్లు ప్రకటించలేదు. గతంలో, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన ఘటనకు కారణంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు కఠినంగా అనుమతులు ఇవ్వడం మానేసింది. అందువల్ల, ఓజీ బెనిఫిట్ షోల కోసం తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం తక్కువగా ఉన్నట్లు సమాచారం. టికెట్ ధరలు పెంచే అవకాశాలు మాత్రం ఉన్నాయి.

Leave a Reply