TGSRTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులకు భారీ నోటిఫికేషన్.. జీతభత్యాలు, అర్హత వివరాలు..!

తెలంగాణ ప్రభుత్వంనుంచి నిరుద్యోగులకు శుభవార్త. టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 28 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/ లో చూడవచ్చు.

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టులు: 1,743

డ్రైవర్ పోస్టులు: 1,000

శ్రామిక్ పోస్టులు: 743

దరఖాస్తు వివరాలు:

ప్రారంభ తేదీ: అక్టోబర్ 8

చివరి తేదీ: అక్టోబర్ 28

వెబ్‌సైట్: https://www.tgprb.in/

జీతభత్యాలు:

డ్రైవర్ పోస్టులు: నెలకు రూ.20,960 – రూ.60,080

శ్రామిక్ పోస్టులు: నెలకు రూ.16,550 – రూ.45,030

ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహిస్తోంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

రాబోయే నోటిఫికేషన్లు:

ప్రస్తుతం డ్రైవర్, శ్రామిక్ పోస్టులతో పాటు త్వరలోనే డిపో మేనేజర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు వంటి వివిధ విభాగాల్లో మరో 3,000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply