Health Tips: ఖాళీ కడుపుతో టీ తాగితే డేంజర్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు..!

భారతీయులలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ తాగే అలవాటు ఉంది. రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఇది ఒక సాధారణ పద్ధతిగా మారింది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం ఉదయం పూట వాత్, పిత్త దోషాలు చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో కడుపు ఖాళీగా ఉండటం, జీర్ణశక్తి అధికంగా ఉండటం సహజం. ఇలాంటి సమయంలో కెఫీన్, టానిన్‌లు అధికంగా ఉండే టీ తాగితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలం అలవాటు చేస్తే కడుపు లోపలి పొర నష్టపోవచ్చు.

నిపుణులు చెబుతున్నట్లుగా, ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావంతో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, అజీర్తి సమస్యలు వస్తాయి. టీలో ఉండే కెఫీన్ కార్టిసాల్ హార్మోన్‌ను పెంచి ఒత్తిడిని పెంచుతుంది. దీని వలన చిరాకు, నిద్రలేమి, మానసిక అస్థిరత వచ్చే అవకాశం ఉంది.

ఖాళీ కడుపుతో కెఫీన్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. దాంతో శరీరానికి అవసరమైన పోషకాలు సరిగా అందవు. దీని కారణంగా ఐరన్ లోపం, రక్తహీనత, బలహీనత సమస్యలు వస్తాయి. రోజుకు 5-6 కప్పుల టీ తాగే వారిలో పోషక పదార్థాల శోషణ తగ్గిపోవడంతో అలసట ఎక్కువ అవుతుంది.

ఉదయం టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని వలన చర్మం పొడిబారడం, తలనొప్పి, బద్ధకం రావచ్చు. టీలోని చక్కెర, ఆమ్లాలు దంతాల ఎనామెల్‌ను బలహీనపరుస్తాయి. దాంతో దంతాలు పసుపు రంగులోకి మారి, ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది.

అయితే, ఇవన్నీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply