చిన్న వ్యాపారుల కోసం ప్రధాని మోదీ ఇప్పటి వరకు అనేక పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. వడ్డీ లేని రుణాల ద్వారా ఇప్పటికే వేలాది మంది తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. అది మోదీ క్రెడిట్ కార్డు.
ప్రస్తుతం వ్యాపారాల కోసం చాలామంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముందుగా డబ్బు ఖర్చు చేసి, తర్వాత చెల్లించే విధానాన్ని ఎక్కువగా బ్యాంకులు అనుసరిస్తున్నాయి. ఇదే విధానాన్ని చిన్న వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రూ.5 లక్షల వరకు పరిమితి గల క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రకటించారు. Udyam పోర్టల్‌లో నమోదు చేసుకున్న వ్యాపారులకు ఈ కార్డులు అందజేస్తారు. మొదటి ఏడాదిలోనే 10 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రెడిట్ కార్డులు అందరికీ కాకుండా, దేశంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకే ఇవ్వబడతాయి. దీనివల్ల వ్యాపారులకు నేరుగా ఆర్థిక లాభాలు కలగనున్నాయి.
ఈ క్రెడిట్ కార్డుతో వ్యాపారం కోసం డబ్బు లేకపోయినా, ముందుగా ఖర్చు చేసి, లాభం వచ్చిన తర్వాత చెల్లించవచ్చు. ముఖ్యంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఈ కార్డు ద్వారా టర్మ్ లోన్లు కూడా తీసుకోవచ్చు.
కార్డు ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత 45 నుంచి 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ తర్వాత చెల్లింపుల ప్రకారం వడ్డీ విధించబడుతుంది. తిరిగి చెల్లించడానికి ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
ఇందుకోసం మోదీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.