చైనాలో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ స్పీడ్ స్కేటింగ్‌లో భారత్ అథ్లెట్లకు మరో రెండు స్వర్ణ పతకాలు సొంతమయ్యాయి. సీనియర్ పురుషుల 1000 మీటర్ల ఈవెంట్లో ఆనంద్ కుమార్, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ పతకాలు సాధించారు.
🚨 IT’S HISTORY GETTING CREATED FOLKS 🤯
INDIA’S ANANDKUMAR VELKUMAR IS THE WORLD SPEED SKATING CHAMPION 2025!🏆
He becomes First Ever India to win the GOLD Medal in 1000m Sprint at World C’ship 🏅
IT SHOULD BE HEADLINE OF INDIAN SPORT! 🇮🇳pic.twitter.com/fvDy5OU3FF
— The Khel India (@TheKhelIndia) September 15, 2025
సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో చరిత్ర
ఆనంద్ కుమార్ భారత్ తరఫున మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలిచారు. 22 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్ 1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్‌ను 1:24.924 సమయంతో పూర్తి చేసి, భారతదేశం తరఫున తొలి వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈక్రీడలో ముందుగా 500 మీటర్ల స్ప్రింట్‌లో వెల్ కుమార్ కాంస్యం సాధించారు. 43.072 సెకన్లలో పూర్తి చేసిన ఈ విజయంతో భారతదేశం మొట్టమొదటి సీనియర్ వరల్డ్ పతకాన్ని గెలుచుకుంది.
🏆🇮🇳 HISTORY CREATED 🇮🇳🏆
LADIES & GENTLEMEN… presenting India’s FIRST-EVER WORLD CHAMPIONS in Speed Skating 🌍⛸️✨
🔥 Anandkumar Velkumar – Sr Men 1,000m Sprint
⚡ Krish Sharma – Jr Men 1,000m SprintA golden chapter for Indian sports! 🥇💙 pic.twitter.com/posBKXGne3
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 15, 2025
జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ స్వర్ణం
మరో వైపు, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ కూడా స్వర్ణ పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ తరఫున చాంపియన్‌షిప్‌లో అద్భుతమైన డబుల్ విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో చెంగ్డులో జరిగిన ప్రపంచ క్రీడల్లో కూడా క్రిష్ కాంస్యం సాధించారు.