ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమల్లో బిగ్ బాస్ షోలు నడుస్తున్నాయి. మలయాళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 7 జరుగుతోంది. ఈ షో ప్రారంభమై కొన్ని వారాలే అయినా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన లెస్బియన్ జంట ఒకటి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గమనార్హమైన విషయం ఏమిటంటే, వీరిద్దరినీ కలిసి ఒకే కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.

కేరళకు చెందిన అదిలా నసరైన్, ఫాతిమా నూరా లెస్బియన్ జంట. ఇప్పుడు వీరి పేర్లు కలిపి “అదిలా నూరా”గా వైరల్ అవుతున్నారు. వీరి పరిచయం సౌదీ అరేబియాలో 12వ తరగతి చదువుతున్న సమయంలో మొదలైంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు.
View this post on Instagram
అయితే విషయం ఇళ్లల్లో తెలిసిపోవడంతో కుటుంబాలు వీరిని వేరుచేయడానికి ప్రయత్నించాయి. అదిలాను కుటుంబం బలవంతంగా తీసుకెళ్లగా, నూరా కుటుంబం పోలీస్ ఫిర్యాదు చేసింది. తరువాత అదిలా హైకోర్టులో LGBT హక్కుల కింద పిటిషన్ వేసింది. ఇదే సమయంలో నూరా సోషల్ మీడియాలో లైవ్ వచ్చి జనాల సపోర్ట్ సంపాదించుకుంది. చివరికి కేరళ హైకోర్టు వీరి పెళ్లికి అనుమతి ఇచ్చింది. 2022లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
View this post on Instagram
ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఇద్దరూ సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇటీవలే మలయాళ బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వీరికి ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ వస్తోంది.
హోస్ట్ మోహన్‌లాల్ కూడా వీరిని అభినందిస్తూ, తన ఇంటికి ఆహ్వానిస్తానని ప్రకటించారు. ఇక ఈ జంట బిగ్ బాస్ కప్ గెలుస్తారో లేదో చూడాలి.
