Urvashi Rautela: ఆ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా..!

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల వివాదంలో చిక్కుకుంది. ఆన్లైన్ 1xBet యాప్ కేసులో ఈడీ ఆమెకు సమన్లు పంపింది. సెప్టెంబర్ 16న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఊర్వశీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.

ఊర్వశీతో పాటు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తి కూడా ఈడీ సమన్లను అందుకున్నట్టు సమాచారం. వీరు 1xBet యాప్ ప్రమోషన్స్ కేసుతో సంబంధించి విచారణకు పిలిపించబడ్డారని తెలుస్తోంది. ఈ కేసులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినందున, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈడీ వీరిని విచారిస్తున్నది.

ఇప్పటికే ఈ కేసులో సురేష్ రైనా, శిఖర్ ధావన్ వంటి మాజీ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఇకపోతే, ఊర్వశీ తెలుగులో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా ద్వారా తెలుగులో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలోని ధబిడి.. దిబిడి పాట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Leave a Reply