RRB Railway Jobs 2025: టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. భారీ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్ తాజాగా పారామెడికల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 434 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు.

ఖాళీల వివరాలు:

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ – 272 పోస్టులు

డయాలిసిస్‌ టెక్నీషియన్‌ – 04 పోస్టులు

హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ గ్రేడ్‌-2 – 33 పోస్టులు

ఫార్మసిస్ట్‌ (ఎంట్రీ గ్రేడ్) – 105 పోస్టులు

రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – 04 పోస్టులు

ఈసీజీ టెక్నీషియన్‌ – 04 పోస్టులు

లాబోరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 – 12 పోస్టులు

అర్హతలు:

సంబంధిత విభాగంలో B.Sc నర్సింగ్, B.Sc, డిప్లొమా, 10+2, ఫార్మసీ, రేడియోగ్రఫీ, DMLTలో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి.

పోస్టుల వారీగా అర్హతలు మారుతాయి.

వయోపరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

OBC, SC, ST అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

General, OBC, EWS – రూ. 500

SC, ST, మైనారిటీ, EBC, PwBD, ESM, మహిళలు, ట్రాన్స్‌జెండర్ – రూ. 250

ఎంపిక విధానం:

రాత పరీక్ష

సర్టిఫికేట్ వెరిఫికేషన్

మెడికల్ ఎగ్జామినేషన్

జీతభత్యాలు (ప్రతి నెల):

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ – ₹44,900

డయాలిసిస్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ & మలేరియా ఇన్‌స్పెక్టర్‌ – ₹35,400

ఫార్మసిస్ట్‌, రేడియోగ్రాఫర్‌ ఎక్స్‌రే టెక్నీషియన్‌ – ₹29,200

ఈసీజీ టెక్నీషియన్‌ – ₹25,500

లాబోరేటరీ అసిస్టెంట్‌ – ₹21,700

చివరి తేదీ:

సెప్టెంబర్‌ 18, 2025 లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.

రైల్వేలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. పూర్తి వివరాలకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Leave a Reply