తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సింగరేణి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS అనుబంధ విభాగం TBGKSకు గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “వాపు చూసి బలుపు అనుకుంటున్నారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో HMS-సింగరేణి జాగృతి సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఆమె, గత ఎన్నికల్లో TBGKS పోటీకి కూడా రాలేదని, ఈసారి సింగరేణి ఎన్నికల్లో గెలిచేది HMS మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. HMS, జాగృతి కలిసి కార్మికుల కోసం పని చేస్తాయని చెప్పారు.
గతంలో కేసీఆర్ చెప్పారనే కారణంగా కార్మికులు TBGKSకు ఓటు వేసారని, కానీ కార్మికుల సమస్యలపై వారు ఎప్పుడూ పోరాటం చేయలేదని కవిత ఆరోపించారు. కార్మికులకు ఉచిత వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కొత్త కొర్రీలు పెట్టి, పదో తరగతి చదివిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించడం తప్పు అని మండిపడ్డారు. 470 అప్లికేషన్లు అడ్డుకున్నారని, చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
కార్మికుల చెమటకు విలువ తెచ్చేది – కవిత అక్క!
సింగరేణి బిడ్డల భవిష్యత్తు కాపాడేది – HMS + కవిత అక్క!
కార్మికుల గర్వం, సింగరేణి గర్వం – మన కవిత అక్క!
ఒక్కటైన గళం – HMS + కార్మికులు + కవిత అక్క!
సింగరేణి బలమే – కార్మికుల ఐక్యత, కవిత అక్క నేతృత్వం!@RaoKavitha pic.twitter.com/gwv2peD7TZ
— Tejachowdhary (@Teja_khairtabad) September 12, 2025
సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, “ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సీబీఐకి కంప్లైంట్ చేస్తాం” అని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ప్రతి కాంట్రాక్ట్‌లో 25% అవినీతి జరుగుతోందని, అందులో 10% కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోందని విమర్శించారు.
“అవినీతి ఆగకపోతే సింగరేణి భవన్‌ను ముట్టడిస్తాం. కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ పార్టీ” అని కవిత ధ్వజమెత్తారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో HMS జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా తాను పనిచేస్తూ కార్మికుల బాగు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.