Lakshmana Rekha: జయసుధ హీరోయిన్‌గా తొలిచిత్రం “లక్ష్మణరేఖ”.. 50 ఏళ్ల ఘనత

సహజనటి జయసుధకు కెరీర్‌లో మైలురాయి గీసిన చిత్రం “లక్ష్మణరేఖ” 12 సెప్టెంబర్ 1975న విడుదలై, ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసింది. ఈ సినిమాలో జయసుధ తన ప్రత్యేకమైన అభినయంతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది.

డైరెక్టర్ ఎన్. గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆ కాలంలో విప్లవాత్మకమైన, వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీమోహన్ – జయసుధ జంటగా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ కలిగిన కీలక పాత్ర పోషించగా, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి ఇతర ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

మ్యూజిక్ డైరెక్టర్ సత్యం సంగీత సారధ్యం వహించి, ఎ.వి.కె. ప్రొడక్షన్స్ పతాకంపై షణ్ముగం చెట్టియార్ మరియు కృష్ణారావు సంయుక్తంగా నిర్మించారు. “లక్ష్మణరేఖ” చిత్రంతో జయసుధకు బాలీవుడ్‌లో మరియు ప్రాంతీయ సినీ రంగంలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

Leave a Reply