BYD Cars: అదానీ చేతుల్లోకి బీవైడీ కార్లు.. భారత్‌లో తయారీకి సన్నాహాలు

టెస్లాకు పోటీగా చైనా తెచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ బీవైడీ (BYD) ఇప్పటికే ఇండియాలో రోడ్లపై పరుగులు పెడుతోంది. ఇప్పుడు ఈ కార్లను మన దేశంలోనే తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

టెస్లా కంటే ఎక్కువ మోడల్స్‌తో, సెడాన్ నుంచి SUVల వరకు విస్తృత శ్రేణి కార్లు ఉన్నందున బీవైడీకి మంచి డిమాండ్ ఉంది. త్వరలోనే కంపెనీ అట్టో 2 కాంపాక్ట్ సెడాన్‌ను భారత మార్కెట్‌లోకి తక్కువ ధరలో విడుదల చేయాలని భావిస్తోంది. ఇక ఈ కార్లను భారత్‌లోనే తయారు చేసి, ఖర్చులను తగ్గించాలన్నది బీవైడీ ప్లాన్.

ఇటీవల భారత్–చైనా సంబంధాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో, బీవైడీ తన ఉన్నతాధికారుల బృందాన్ని దేశంలోకి పంపిస్తోంది. గతంలో సుంకాల కారణంగా కార్ల ధరలు ఎక్కువై వినియోగదారుల ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు స్థానికంగా ఉత్పత్తి చేస్తే పరిస్థితి మారుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం

బీవైడీ కార్లలో వినియోగించే లిథియమ్ అయాన్ బ్యాటరీలు తయారీ కోసం కంపెనీ, భారత దిగ్గజం అదానీ గ్రూప్ తో భాగస్వామ్యం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బస్సుల తయారీలో హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా కంపెనీతో, అలాగే ట్రక్కుల ఉత్పత్తిలో మరో హైదరాబాద్ కంపెనీతో ఒప్పందాలు కలిగి ఉంది. అయితే కార్ల ఉత్పత్తి కోసం కొత్త భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని యోచిస్తోంది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు బీవైడీ ఆసక్తి చూపుతోంది. ఇక్కడే కార్ల తయారీ యూనిట్ స్థాపించే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. పరిస్థితుల బట్టి ఈ ప్రపోజల్ త్వరలో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply