యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ సిరీస్ లాంఛ్ అయిపోయింది. ఐఫోన్ 17 మార్కెట్లోకి నేరుగా విడుదలైంది. యాపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లను పరిచయం చేసింది.
ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాపిల్ కొత్త ప్రోడక్ట్‌లను లాంఛ్ చేస్తుంది. 16 సిరీస్‌ల తర్వాత ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ వినియోగదారుల ముందుకు వచ్చింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు కాలిఫోర్నియాలో యాపిల్ పార్క్‌లో ఈవెంట్ జరిగింది. ఈ సిరీస్‌తో పాటు, న్యూజనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3, స్మార్ట్‌వాచ్ సిరీస్ 11, SE3 వాచ్ కూడా లాంఛ్ అయ్యాయి.
ఐఫోన్ 17 ఫీచర్లు:
లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్
స్లిమ్ డిజైన్
బేస్ స్టోరేజ్ 256GB
iOS 26 సాఫ్ట్‌వేర్
120Hz రిఫ్రెష్ రేట్
3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
సిరమిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్
వేగవంతమైన ఛార్జింగ్: 20 నిమిషాల చార్జ్‌తో ఫుల్ బ్యాటరీ
మార్కెట్ రీలీజ్: సెప్టెంబర్ 19
కొత్తగా ఐఫోన్ ఎయిర్:
అత్యంత స్లిమ్ డిజైన్
A19 ప్రో చిప్
వెనక 48MP, ముందువైపు 18MP కెమెరా
e-SIM సపోర్ట్
6.5 అంగుళాల డిస్‌ప్లే
80% రిసైకిల్ చేసిన టైటానియం బాడీ
రంగులు: స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ
స్టోరేజ్: 256GB, 512GB, 1TB
ధర: 256GB వేరియంట్ రూ.1,19,900
17 సిరీస్ ధరలు:
ఐఫోన్ 17 256GB: రూ.82,900
ఐఫోన్ 17 ప్రో 256GB: రూ.1,34,900
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB: రూ.1,49,900
కొత్త వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్
A19 ప్రో చిప్
వెనక ట్రిపుల్ కెమెరా 48MP
ఫ్యూజన్ టెక్నాలజీ
ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌లు వినియోగదారుల కోసం అత్యంత డ్యూరబుల్, స్క్రాచ్-రెసిస్టెంట్‌గా రూపొందించబడ్డాయి. ఫోన్‌లతో పాటు, ఐఫోన్ ఎయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది, స్లిమ్ డిజైన్ మరియు లేటెస్ట్ AI ఫీచర్లతో.