ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల దూకుడు కొనసాగుతోంది. పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, విస్తృత ప్రమోషన్లు లేకపోయినా ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి రికార్డు వసూళ్లు సాధిస్తున్నాయి. స్టార్ హీరోలు లేకపోయినా కథలో దమ్ముంటే చాలు, ప్రేక్షకులు హిట్ చేస్తారనేది మరోసారి రుజువైంది. తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ అదే సాక్ష్యం. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం 7 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.185 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించింది. త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. 11 రోజుల్లోనే దాదాపు $10 మిలియన్లు (₹91 కోట్లు) వసూలు చేసి మలయాళ సినిమా చరిత్రలో అరుదైన రికార్డ్‌ను సృష్టించింది. ఈ ఏడాది మలయాళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ఎల్ 2: ఎంపురాన్’, ‘తుడురాం’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
203K tickets sold in 24hrs for #Lokah on BookMyShow! 💥 The momentum is REAL! #Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/JiMnlIm6nj
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2025
ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే – సూపర్ హీరోగా హీరో కాకుండా హీరోయిన్నే చూపించారు. నటి కల్యాణి దర్శినికి ప్రత్యేక సూపర్ పవర్స్ ఉన్నట్లు కథను మలచి కొత్తగా చూపించారు. ఈ రోల్లో కల్యాణి నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ హీరోగా కనిపించాడు.