Actress Ranga Sudha : రంగ సుధపై అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం కొత్తేమీ కాదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. తాజాగా టాలీవుడ్ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రంగ సుధ ఫిర్యాదు ప్రకారం, రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని తెలిపారు. గతంలో రాధాకృష్ణతో రిలేషన్‌లో ఉన్న సమయంలో తీసిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని అతను బెదిరించాడని సుధ ఆరోపించారు. ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజీలలో కూడా అతను పోస్టులు చేస్తున్నాడని, ఫోటోలు మార్ఫ్ చేసి పెట్టిస్తున్నాడని పేర్కొన్నారు.

సుధ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రాధాకృష్ణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా లేదా షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇక వివరాల్లోకి వెళ్తే, సుధ గతంలో రాధాకృష్ణతో ఉన్న సంబంధం విరిగిపోయింది. ఆ తర్వాత అతను ప్రతీకారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ కాల్స్ చేసి ప్రైవేట్ వీడియోలను పబ్లిక్ చేస్తానని బెదిరించాడని సుధ తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

రంగ సుధ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మలయాళంలో తేరి మేరీ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆమె సిగరెట్ కాలుస్తున్న వీడియో బయటపడి, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ వీడియో నిజమో కాదో ఇంకా స్పష్టత రాలేదు.

Leave a Reply