COOLIE OTT : ఓటీటీలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 11 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా అమెజాన్ ఎక్స్ వేదికగా పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటించారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గత నెల 14న విడుదలైన ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి మంచి స్పందన లభించగా, కథనం బలంగా లేదన్న విమర్శలు వచ్చాయి. విక్రమ్, ఖైదీ, మాస్టర్ సినిమాల్లో కనిపించిన “లోకేష్ మార్క్” ఇక్కడ తగ్గిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

అయినా కూడా రజినీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోల ఇమేజ్ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకున్న ‘కూలీ’, సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వస్తోంది. దీంతో థియేటర్‌లో మిస్ అయిన వారు ఇక ఓటీటీలో రజినీ మాస్ ఎనర్జీని ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply