GST : జీఎస్‌టీ ఎఫెక్ట్ తో సామాన్యులకు బిగ్ షాక్.. ఈ వస్తువులపై భారీగా పెంపు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్‌టీ స్లాబ్‌లలో కీలక మార్పులు చేసింది. దీంతో పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లు వంటి వాటిపై పన్ను 28% నుంచి 40%కి పెంచబడింది. అంతేకాకుండా కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ ఉన్న పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్ ధరలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు మాత్రం తగ్గేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై కేవలం 5% మరియు 18% అనే రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. 12%, 28% స్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

ధరలు పెరిగే వస్తువులు

పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు, సిగరెట్లు (28% నుంచి 40%)

కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ పానీయాలు, ఫ్రూట్ ఫిజ్జీ డ్రింక్స్

లగ్జరీ కార్లు, పెద్ద బైక్‌లు, ప్రైవేట్ విమానాలు, రివాల్వర్లు, పిస్టల్స్

బొగ్గు, లిగ్నైట్ (5% నుంచి 18%)

బయోడీజిల్ (12% నుంచి 18%)

రూ. 2,500 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు, హై-వాల్యూ కాటన్ దుప్పట్లు (18%)

ధరలు తగ్గే వస్తువులు

హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌లు, షేవింగ్ క్రీమ్ (5%)

బటర్, నెయ్యి, చీజ్ వంటి డెయిరీ పదార్థాలు

పాలు, పన్నీర్, ఇండియన్ బ్రెడ్‌లు (జీఎస్‌టీ నుంచి మినహాయింపు)

చిన్న పిల్లల నాప్కిన్లు, ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు

బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్

మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్, పెన్సిళ్లు, షార్పనర్లు, క్రేయాన్స్, పాస్టెల్స్

ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్‌బుక్స్ (12% నుంచి 5%)

మొత్తానికి కొత్త జీఎస్‌టీ రేట్లతో సామాన్యులకు కొంత ఊరట లభించినా, విలాస వస్తువులు మరియు హానికర పదార్థాల ధరలు మాత్రం భారీగా పెరగనున్నాయి.

Leave a Reply