Sugali Preethi : సుగాలి ప్రీతీ కేసు.. సీబీఐ కి అప్పగించిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి సుగాలి ప్రీతీ కేసు దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2017లో ప్రీతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18న కర్నూల్‌లోని స్కూల్‌ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం పెద్ద కలకలానికి దారి తీసింది. అప్పటి నుండి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

Also Read: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్‌ షా.. హైదరాబాద్‌లో హై అలర్ట్

వైసీపీ హయాంలో కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. ఆ సమయంలో ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని, కేసును పరిష్కరిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు హామీలు ఇచ్చారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది దాటినా, తమ కూతురు కేసు పరిష్కారంలో పురోగతి లేకపోవడం పట్ల ప్రీతి తల్లి వాపోయింది. నిరసనగా వీల్ చైర్ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం మరోసారి ఈ కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించింది.

Leave a Reply