నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.
హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులుంటారని దర్శకులు చెప్పే మాట అందరికీ తెలుసు. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, నిజంగానే పవన్ చరిష్మాకు నిదర్శనం. ఒక హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఆ క్రేజ్ తగ్గిపోతుంది. కానీ పవర్ స్టార్ మాత్రం దీనికి మినహాయింపు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన క్రేజ్ తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. అందుకే ఆయనకు అభిమానులు కాదు, భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్‌కు హిట్లు, ఫ్లాపులు వేరే… అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉంటుంది.
“నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను” అనే డైలాగ్ ఆయన సినీ కెరీర్‌కు సరిపోతుంది. మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. తొలి ప్రీమ, బద్రి, ఖుషి, తమ్ముడు వంటి సినిమాలతో తనదైన స్టైల్, యాటిట్యూడ్, మ్యానరిజంతో కొత్త ట్రెండ్ సెట్ చేశారు.
సినిమా క్రేజ్:
తొలిప్రేమ లక్షలాది యువతను పవన్ మాయలో పడేసింది.
బద్రి, ఖుషీతో పవన్ మేనియా పీక్‌కి చేరింది.
“సిద్దు… సిద్ధార్థ్ రాయ్”, “నువ్వు నంద అయితే నేను బద్రి” వంటి డైలాగులు యువతలో హవా చేశారు.
2001లో ఖుషీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పవన్, ఆ తర్వాత జానీ ద్వారా దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించారు. కానీ జానీ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చాయి. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. “నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు” అనే బాలు డైలాగ్‌లా, ఆయన నిజజీవితంలో కూడా పోరాటం ఆపలేదు.
దాదాపు దశాబ్దం తర్వాత 2012లో గబ్బర్‌సింగ్‌తో మళ్లీ బిగ్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపించారు. తక్కువ సినిమాలతోనే మెగాస్టార్ స్థాయిలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పవన్, రాజకీయాల్లోనూ అదే స్థాయిలో నిలిచారు.
రాజకీయ ప్రయాణం:
“ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు” అన్న డైలాగ్ రీల్ లైఫ్‌లో చెప్పిన పవన్, రియల్ లైఫ్‌లోనూ నిరూపించారు. ఏపీ ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే పోటీచేసినా.. ఆ 21/21 ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ రోజు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు.