ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువునా సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జనసైన్యానికి ధైర్యం, మాటకు కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం… ఇవన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. పాలనలో, రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది” అని తెలిపారు.
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…అన్నీ కలిస్తే… pic.twitter.com/TqlmiEIwBZ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2025
అటు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజాహితం కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం ఎప్పుడూ ముందుంటారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు కట్టుబడి ఉంటారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు… pic.twitter.com/QEKiv9mInU
— Lokesh Nara (@naralokesh) September 2, 2025