టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స (Director Mohan Srivatsa) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. కారణం ఏంటంటే.. తానే తన చెప్పుతో తనని కొట్టుకోవడం! ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందిన త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్టు 29, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా, సత్యం రాజేశ్ వంటి ప్రముఖులు నటించారు. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చినా, థియేటర్లలో ఆడియన్స్ రాకపోవడంతో డైరెక్టర్ మోహన్ తీవ్ర నిరాశ చెందారు.
ఆయన చెప్పిన ప్రకారం, ఒక థియేటర్‌కి వెళ్లి చూడగా కేవలం 10 మంది ప్రేక్షకులే ఉన్నారు. తనను ఎవరికీ పరిచయం చేయకుండా సినిమా ఎలా ఉందని అడిగితే అందరూ బాగుందన్నారు. అయినా హాళ్లు ఖాళీగా ఉండటంతో మోహన్ ఎమోషనల్ అయ్యారు. శనివారం సాయంత్రం డిప్రెషన్లో ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేశానని, తన భార్యకు సినిమాకు వెళ్లమని చెప్పినట్లు చెప్పారు. కానీ అరగంటలోనే భార్య తిరిగి రావడంతో, “నేను ఏదైనా ఆత్మహత్య చేసుకుంటానేమో అనుకుని వెంటనే ఇంటికి వచ్చేసింది” అని మోహన్ చెప్పుకొచ్చారు.
ఇలా అయితే నేను సినిమా ని మలయాళం లో తీసి తెలుగు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి – #TribanadhariBarbarik ఫిల్మ్ డైరెక్టర్ #MohanSrivatsa ఆవేదన @monivathsa #Barbarik pic.twitter.com/wkrAIJeUAh
— Sai Satish (@PROSaiSatish) August 31, 2025
జనాలు ఎందుకు రావడం లేదు?
“రెండున్నరేళ్లుగా నేను చేసిన కష్టాన్ని పక్కన పెట్టి, థియేటర్లకు ఎందుకు జనాలు రావడం లేదో అర్థం కావడం లేదు. ఇక మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తాను. అక్కడ మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. నేను ఓ తెలుగోడిగా ఆడియన్స్‌కు చూపిస్తాను, హిట్ కొట్టి నిరూపిస్తాను. నచ్చకపోతే నా చెప్పుతో నేనే నన్ను కొట్టుకుంటాను అన్నాను.. ఇప్పుడు అదే చేస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు మోహన్.