‘డీజే టిల్లూ’ సినిమాలో రాధిక పాత్రతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్లామర్, నటనతో కుర్రాళ్లను ఫిదా చేసిన నేహాకు సినిమాల తర్వాత సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
పవన్‌తో స్పెషల్ సాంగ్
తాజాగా నేహా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ (OG) సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం మేకర్స్ నేహాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నేహా గ్లామర్, యూత్ ఫాలోయింగ్ ఈ సాంగ్‌కి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. గతంలో పవన్ ‘పంజా’ మూవీలో ‘వేయ్ రా చేయి వేయ్ రా’ సాంగ్ యూత్‌ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ పాట సినిమాకి హైలైట్ కానుందన్న అంచనాలు ఉన్నాయి.
View this post on Instagram
ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్
హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో నూతన ట్రెండ్‌గా మారింది. హీరోయిన్స్ స్పెషల్ నెంబర్‌లో మెరవడం ద్వారా సినిమాకు బజ్, రీచ్ పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. సమంత ‘ఓ అంటావా మావా’, పూజా హెగ్డే ‘జిల్ జిల్ జిగేలు రాణి’, కాజల్ ‘పక్కా లోకల్’, తమన్నా ‘రా నువ్వు కావాలయ్యా’ వంటి సాంగ్స్ సూపర్ హిట్స్ కావడం దీనికి ఉదాహరణ. ఇప్పుడు నేహా కూడా అదే రూట్‌లో అడుగు పెట్టబోతోందని టాక్.
నేహా కెరీర్ జర్నీ
‘టిల్లూ’ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న నేహా, ‘రూల్స్ రంజన్’, ‘బెదురు లంక’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతానికి పెద్దగా ప్రాజెక్టులు లేవు. చివరిగా 2024లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటించింది.
సినిమాల్లో తక్కువగానే కనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది నేహా. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్స్, వెకేషన్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.