Reliance Jio IPO : త్వరలో జియో IPO.. మెటా భాగస్వామ్యంతో రిలయన్స్ ఏఐ కొత్త కంపెనీ!

రిలయన్స్ జియో (Reliance Jio) వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లో ఐపీఓ (Jio IPO) రూపంలో రాబోతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. జియో ఐపీఓపై ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, 2027 నాటికి కంపెనీ ఎబిటాను రెట్టింపు చేస్తామని అంబానీ ధైర్యం ఇచ్చారు. అయితే ఐపీఓకి సంబంధించిన ఖచ్చితమైన తేదీ మాత్రం వెల్లడించలేదు.

ఇదే సమయంలో, జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి కూడా ప్రవేశించబోతోందని ఆయన వెల్లడించారు. “ప్రతీ చోటా, ప్రతి ఒక్కరి కోసం ఏఐ” అనే నినాదంతో రిలయన్స్ ఏఐ సొల్యూషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీసులు అందించనుందని చెప్పారు. ఇందుకోసం రిలయన్స్-మెటా కలిసి రూ.855 కోట్ల పెట్టుబడులతో సంయుక్త సంస్థను స్థాపించబోతోంది. గూగుల్ సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.

జియో ఏఐ మోడల్స్‌ను ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలతో అనుసంధానం చేయాలని రిలయన్స్ యోచిస్తోంది.

ఇక జియో ఐపీఓతో పాటు జియో పీసీ (Jio PC) పై కూడా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆకాష్ అంబానీ వెల్లడించిన వివరాల ప్రకారం, జియో పీసీ ద్వారా టీవీ లేదా ఏదైనా స్క్రీన్‌ను ఏఐ రెడీ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది.

Leave a Reply