మెగా, అల్లు ఫ్యామిలీల్లో విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత!

మెగా, అల్లు ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అర్జున్ నానమ్మ, నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు. వృద్ధాప్య కారణాలతో అర్థరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామ్‌చరణ్ మైసూర్‌ నుంచి, బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు అరవింద్, చిరంజీవి పర్యవేక్షిస్తున్నారు.

ఇక వైజాగ్‌లో నేడు జనసేన బహిరంగ సభ ఉండటంతో పవన్ కల్యాణ్, నాగబాబు ఆదివారం హైదరాబాదుకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.

కనకరత్నమ్మ అల్లు అర్జున్‌కు నానమ్మ కాగా, రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అవుతుంది. ఆమె మరణవార్త తెలిసిన తర్వాత బంధుమిత్రులు, సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం.

Leave a Reply