నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా అఖండ 2 రాబోతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించినా, గత కొన్ని రోజులుగా వాయిదా పడే అవకాశంపై వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. అధికారిక ప్రకటనలో, “గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించి అంచనాలను మరింత పెంచింది. ఇలాంటి భారీ సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేం. రీ-రికార్డింగ్, VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయం అవసరం. అందువల్ల సెప్టెంబర్ 25కి కాకుండా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాము. అఖండ 2 కేవలం సినిమా కాదు, అది ఒక పండుగ” అని స్పష్టం చేసింది.
#Akhanda2 – AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025
ఫ్యాన్స్ అయితే నిరాశ చెందినా, మరింత గ్రాండ్‌గా, విజువల్ వండర్‌గా అఖండ 2 రానుందని యూనిట్ హామీ ఇచ్చింది.