Samantha : అందుకే సినిమాలు తగ్గించా.. మొత్తానికి నోరు విప్పిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ ఫోటోషూట్లు, ఫిట్‌నెస్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయినప్పటికీ సామ్ సినిమాల్లో తగ్గిపోవడంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉండే ఆమెకి ఇప్పుడు అవకాశాలు తగ్గాయా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ గ్రాజియా ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పింది. గ్రాజియా ఇండియా తమ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్‌పై సమంత ఫొటోను ప్రింట్ చేసి, అదే సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ప్రచురించింది.

Also Read : హోటల్‌కు రమ్మన్నాడంటూ నటి సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ లీడర్ రాజీనామా!

ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశామనేది కంటే ఎంత మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం అని తెలిపింది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పింది. గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని, ఫిట్‌నెస్ మరియు సినిమాలపై దృష్టి సారిస్తున్నానని వెల్లడించింది. “నేను చేసే సినిమాలు కేవలం ఫ్యాషన్ కోసం గాని, గుర్తింపు కోసం గాని కావు.. అవన్నీ నా మనసుకు దగ్గరైన కథలే” అని చెప్పింది.

అందుకే ప్రాజెక్టులు తగ్గించానని, ఇక నుంచి ఒకేసారి నాలుగు-ఐదు సినిమాలు చేయనని స్పష్టంచేసింది. “నా శరీరం చెబితేనే వింటాను. తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే మంచి కంటెంట్‌తో వస్తాను. సినిమాల సంఖ్య తగ్గినా, వాటి నాణ్యత మాత్రం పెరుగుతుంది” అని చెప్పింది సమంత.

Also Read : నకిలీ సర్టిఫికేట్లతో 59 మందికి పోలీస్ ఉద్యోగాలు.. తెలంగాణలో కలకలం!

నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న సమంత, తన ట్రాలాల బ్యానర్ ద్వారా యంగ్ టాలెంట్‌కి అవకాశాలు ఇస్తోంది. ఇటీవలే ఈ బ్యానర్‌పై నిర్మించిన శుభం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మహిళల్లో సీరియల్ అడిక్షన్ అనే అంశాన్ని హారర్ ఎలిమెంట్స్‌తో కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించిన ఈ సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సామ్ చివరిగా 2023లో ఖుషీ సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం, రంగమార్తాండ సినిమాలు చేస్తోంది.

Leave a Reply