Coolie Day1 Collections: రజినీ ‘కూలీ’ ఒక్కరోజుకే 150 కోట్ల రికార్డు.. బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్!

‘కూలీ’ సినిమా కంటెంట్ పరంగా కొంతమందికి నిరాశ కలిగించినప్పటికీ, కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధిస్తోంది. లోకేష్ కనగరాజ్ – సూపర్‌స్టార్ రజినీకాంత్ కాంబోలో వచ్చిన ఈ సినిమా, స్టార్ క్యామియోలు మరియు రజినీ బాక్సాఫీస్ స్టామినా కారణంగా రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

లోకల్ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ‘కూలీ’కు మిక్స్డ్ టాక్ వుంది. రజినీ ఫ్యాన్స్ సినిమా సూపర్ అని రచ్చ చేస్తుంటే, కొందరు సినీ విశ్లేషకులు మరియు సోషల్ మీడియా రివ్యూలు సినిమా కథలో బలం లేకపోవడం, స్టార్ క్యామియోలు వృథా అయినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ క్యామియోలను సరిగ్గా ఉపయోగించలేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే, కమర్షియల్‌గా ‘కూలీ’ అద్భుతంగా రికార్డులు క్రియేట్ చేసింది. తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. రజినీకాంత్ కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది. ఇండియాలో మాత్రమే కాకుండా, ఓవర్స్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో మంచి స్పందన వుంది. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా $2 మిలియన్ వసూళ్లు రాబట్టింది.

ఆగస్టు 15 వీకెండ్ కావడంతో, రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply