భారీ యాక్షన్ మూవీ వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదలకు ముందే సెన్సార్ బోర్డు (CBFC) కొన్ని సీన్లకు కత్తెర వేసింది.
సమాచారం ప్రకారం, మూవీ టీమ్ సుమారు 10 నిమిషాల సీన్లను కట్ చేసి పంపినప్పటికీ, CBFC మళ్లీ కొన్ని మార్పులు సూచించింది. ముఖ్యంగా, కియారా అద్వానీ బికినీలో కనిపించే పూల్ సీన్లోని 9 సెకన్ల “సెన్సువల్ విజువల్స్” తొలగించాలని ఆదేశించింది. ఈ సీన్ ఆవన్ జావన్ పాటలో ఉండగా, టీజర్ మరియు పాట విడుదలయ్యాక కియారా లుక్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
#War2: 10 minutes trimmed by the censor board, including a bikini sequence pic.twitter.com/dKl7pcHfWB
— Ayyappan (@Ayyappan_1504) August 10, 2025
కియారా ఈ పాత్ర కోసం ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేక డైట్, వర్కౌట్స్ చేశారు. తల్లి అయిన తర్వాత ఆమెకు ఇది రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సెన్సార్ కోతల వల్ల కొంత నిరాశ చెందుతున్నారు.
ఇక, వార్ 2 ఈ నెలలో విడుదల కానున్న రజనీకాంత్ కూలీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. మరోవైపు, కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతోంది.