న్యూఢిల్లీ, ఆగస్టు 8, 2025:
భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతకు గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 ఆగస్టు 7న భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించగా, అనంతరం అదనంగా మరో 25 శాతం సుంకాలను ప్రకటించారు. దీంతో మొత్తం 50 శాతం టారిఫ్‌ల భారం భారత ఎగుమతులపై పడనుంది.
ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేత శశిథరూర్ సహా పలువురు నేతలు “అమెరికా చర్యలకు సమానమైన ప్రతీకారం భారత్ చూపాలి” అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యవసర కేబినెట్ సమావేశం ఆగస్టు 8న మధ్యాహ్నం 1 గంటకు జరిగింది. సమావేశంలో అమెరికా నిర్ణయాలకు ప్రతిస్పందనగా భారత్ తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై సమగ్రంగా చర్చించారు.
“భారత్ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదు” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే అధికారిక ప్రతిస్పందన, ప్రతికార చర్యల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
