Film Actress: రూ.240 కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజోల్ ముఖర్జీ ప్రస్తుతం ఆస్తుల విషయానికి వచ్చేసరికి సరికొత్త చర్చకు కేంద్రబిందువయ్యారు. మహారాష్ట్రలో జన్మించిన ఈ అందాల తార బర్త్‌డే సందర్భంగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు కాజోల్ సుమారుగా రూ.240 కోట్లు సంపాదించినట్టు తెలిసింది. ఇందులో ఒకటిన్నర దశాబ్దం సినీ కెరీర్ కన్నా ఎక్కువగా ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారానే సంపాదించిందనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం ఒక్క రియల్ ఎస్టేట్ నుంచే ఆమెకు దాదాపు రూ.180 కోట్లు ఆదాయం వచ్చిందట.

ముంబైలోని లింకింగ్ రోడ్, గోరేవార్, జుహూ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆమెకు అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు ఉన్నట్టు సమాచారం. అందులో గోరేవార్ ప్రాంతంలోని ఒక ప్రాపర్టీ విలువే సుమారుగా రూ.30 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

అయితే అధికారికంగా మాత్రం ఆమె వ్యక్తిగత ఆస్తులు రూ.180 కోట్లు మాత్రమేనని చెబుతున్నప్పటికీ.. బహిరంగ మార్కెట్ అంచనాల ప్రకారం కాజోల్ ఆస్తుల విలువ రూ.250 కోట్ల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply