విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ “కింగ్‌డమ్” జులై 31న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకుంది.
సినిమాలో శ్రీలంక తమిళులు విలన్లుగా చూపించారని కొందరు ఆరోపణలు చేస్తుండగా, ఈ వ్యాఖ్యలు తమిళనాట ఆగ్రహాన్ని రేపాయి. వివాదం కొనసాగుతుండగా.. తమిళనాడులోని ఓ సినిమా థియేటర్ వద్ద అమర్చిన ‘కింగ్‌డమ్’ బ్యానర్‌ను అక్కడి అభిమానులు చించివేయడంతో కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Kingdom – banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy
— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025
యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ – సాయిసౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. అలాగే సత్యదేవ్, వెంకటేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సినిమా హిట్ టాక్ తో నడుస్తుండగా ఇలా జరగడంతో.. ‘కింగ్‌డమ్’ టీమ్ ఇప్పుడు ఈ వివాదానికి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.