యంగ్ హీరో కిరీటి రెడ్డి, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘జూనియర్’ (Junior Movie) జులై 18న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా, ప్రారంభం నుంచి మంచి అంచనాలు తెచ్చుకుంది. అయితే కథలో బలహీనతలున్నప్పటికీ, కిరీటి నటన, డ్యాన్స్, యాక్షన్ పరంగా ప్రశంసలు అందుకున్నాడు. విడుదల తర్వాత మిశ్రమ స్పందన వచ్చినా, మొదటి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
The sensational chartbuster of the year is here! 💥#ViralVayyari Full Video Song from #Junior is out now — vibe to the viral madness! 🔥🎶
A Rockstar @ThisIsDSP Musical 🎸🔥@geneliad @KireetiOfficial @sreeleela14 @DOPSenthilKumar @rk91_reddy… pic.twitter.com/rXTfnH9ooH
— Aditya Music (@adityamusic) August 4, 2025
ఇందులోని ‘వైరల్ వయ్యారి’ సాంగ్ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. లిరికల్ వీడియోతోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పాట ఇప్పుడు ఫుల్ వీడియోగా విడుదలై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్, గ్లామరస్ లుక్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి. కిరీటి-శ్రీలీలల కెమిస్ట్రీ, స్టెప్పులు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ పాటలో శక్తివంతమైన బీట్స్, క్యాచీ ట్యూన్ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. శ్రీలీల ప్రతి స్టెప్‌లో ఎనర్జీ, స్టైల్ కనిపించగా.. కిరీటి కూడా తన డ్యాన్స్ స్కిల్స్‌తో మంచి మార్కులు కొట్టేశాడు. విజువల్స్, కొరియోగ్రఫీ, స్టైలింగ్ అన్నీ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.