71st National Film Awards 2023: భగవంత్ కేసరి, బలగం సినిమాలకు నేషనల్ అవార్డ్స్.. ఫుల్ లిస్ట్ ఇదే..!

71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను అధికారికంగా ప్రకటించారు. 2023లో విడుదలైన సినిమాలపై ఈ అవార్డులు వర్తించాయి. ఇందులో తెలుగు సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు గానూ కాసర్ల శ్యామ్‌ ఉత్తమ లిరిస్ట్ అవార్డును అందుకున్నారు.

ఇక ప్రముఖ నటుల విభాగంలో, ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే (12th ఫెయిల్), షారుక్ ఖాన్ (జవాన్) ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డు రాణీ ముఖర్జీకి (మిసెస్ ఛటర్జీ vs నార్వే) లభించింది. ఈసారి సౌత్ సినిమాలు చాలా విభాగాల్లో దూసుకెళ్లాయి. ఫుల్ లిస్ట్ ఇక్కడ:

ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ

ఉత్తమ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి

ఉత్తమ తమిళ ఫిల్మ్: పార్కింగ్

ఉత్తమ హిందీ ఫిల్మ్: కథల్: ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ

ఉత్తమ పంజాబీ ఫిల్మ్: గాడ్డే గాడ్డే చా

ఉత్తమ ఒడియా ఫిల్మ్: పుష్కర

ఉత్తమ మరాఠీ ఫిల్మ్: శ్యామ్చి ఆయ్

ఉత్తమ మలయాళ ఫిల్మ్: ఉల్లోజోక్కు

ఉత్తమ కన్నడ ఫిల్మ్: కందీలు: ది రే ఆఫ్ హోప్

ఉత్తమ గుజరాతీ ఫిల్మ్: వాష్

ఉత్తమ బెంగాలీ ఫిల్మ్: డీప్ ఫ్రిడ్జ్

ఉత్తమ అస్సామీ ఫిల్మ్: రంగతపు 1982

ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (12th ఫెయిల్), షారుక్ ఖాన్ (జవాన్)

ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: హను-మాన్ (తెలుగు)

ఉత్తమ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ

ఉత్తమ లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్ – ‘ఊరు పల్లెటూరు’ (బలగం)

ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్

ఉత్తమ స్క్రీన్ ప్లే: బేబీ (తెలుగు), పార్కింగ్ (తమిళం)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి – తమిళం)

ఉత్తమ మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: 2018 – ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో (మలయాళం)

ఉత్తమ ఎడిటింగ్: పూకలం (మలయాళం)

స్పెషల్ మెన్షన్ (రీ-రికార్డింగ్ మిక్సర్): యానిమల్ – M R రాధాకృష్ణన్

నాన్-ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్త

ఉత్తమ డాక్యుమెంటరీలు:

నేకల్: క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం)

ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా)

ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

ఉత్తమ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)

Leave a Reply