Dharmasthala Case: ధర్మస్థల ఆలయం చుట్టూ మిస్టరీ.. వెలుగులోకి రహస్య మృతదేహాలు!

ధర్మస్థల ఆలయం చరిత్రలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల దగ్గర ఇటీవల అనుమానాస్పద మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును సిట్ అధికారుల బృందం తీవ్రంగా విచారిస్తోంది.

తొలుత మృతదేహాలను తానే పూడ్చినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పగా, అతడు చూపించిన స్థలాల్లో తవ్వకాలు జరిపారు. ఇప్పటివరకు 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరం, 15 మానవ ఎముకలు, కొన్ని దుస్తులు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కి పంపించారు.

ఈ మిస్టరీ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంది. ధర్మస్థలిని పురాణకాలంలో ‘కుడుమ’గా పిలిచేవారు. ఇక్కడ హెగడే అనే జైన కుటుంబం స్థిరపడింది. దేవతల ఆదేశాలతో వారే శ్రీ మంజునాథుని ఆలయాన్ని నిర్మించారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.

ప్రస్తుతం హెగడే కుటుంబానికి చెందిన డా. వీరేంద్ర హెగ్డే ఆలయ ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. కానీ 1998 నుంచి 2014 మధ్య ఈ ప్రాంతంలో అనేక మహిళలు, యువతులు అదృశ్యమవ్వడంపై తాజాగా వెలుగు చూసిన వివరాలు భయానక వాస్తవాలను తేలుస్తున్నాయి. అనుమానాస్పద మృతులు లైంగిక దాడులకు గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసుపై ఇంకా సిట్ విచారణ కొనసాగుతోంది. మరిన్ని అసలైన నిజాలు బయటపడే అవకాశం ఉంది.

Leave a Reply