BSNL ఫ్రీడమ్ ప్లాన్: రూ.1కే ఫ్రీ సిమ్, 30 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ‘BSNL ఆజాదీ కా ప్లాన్‌’ పేరుతో ఓ సంచలనాత్మక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ కింద కొత్త యూజర్లకు పూర్తిగా ఉచితంగా 4G సిమ్ అందించబడుతుంది. అంతేకాక, కేవలం రూ.1 చెల్లించి 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌ ద్వారా ప్రకటించింది. ఇది 2025 ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

4G సేవల విస్తరణ లక్ష్యంగా..
ఇటీవల 4G సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టిన BSNL, ఈ ఆఫర్ ద్వారా కొత్త కస్టమర్లను లాగేందుకు ప్రయత్నిస్తోంది. జియో ప్రారంభంలో ఇచ్చిన ఉచిత సిమ్‌ల తరహాలోనే బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

ఆసక్తి గల వారు తమ సమీప బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రిటైలర్‌ను సంప్రదించి కొత్త సిమ్‌ను పొందవచ్చు.

ఇదిలా ఉండగా, ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో BSNL సుమారు 2 లక్షల కస్టమర్లను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ తిరిగి మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ఈ ఆఫర్‌కు ప్రాధాన్యత కలిగింది.

BSNL ప్రముఖ 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు:
రూ.147: 10GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ – 30 రోజుల వ్యాలిడిటీ

రూ.187: రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు – 28 రోజులు

రూ.247: 50GB డేటా, అపరిమిత కాల్స్ – 30 రోజులు

రూ.398: అపరిమిత డేటా (FUP లేకుండా), అపరిమిత కాల్స్, 100 SMSలు – 30 రోజులు

రూ.599: రోజుకు 5GB డేటా, అపరిమిత కాల్స్ – 84 రోజులు

రూ.1498: రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ – 365 రోజులు

రూ.1999: రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్స్ – 365 రోజులు

ఇంకా డేటా స్పీడ్‌, FUP పాలసీ, లేదా ఏమైనా వివరాలు కావాలంటే అధికారిక BSNL వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Reply