Rashmika Mandanna: విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటలో తేల్చేసింది..!

విజయ్ దేవరకొండకు మళ్ళీ మంచి కంబ్యాక్ కావాలి అనే కోరిక చాలా కాలంగా ఉంది. ఈ లక్ష్యంతోనే వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నా, ఇప్పటివరకు అతనికి గట్టి హిట్ దక్కలేదు. కానీ ఈసారి మాత్రం నిశ్చయంగా హిట్ కొట్టాలనే ధ్యేయంతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్‌’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశాడు. సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అప్డేట్‌తో మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ రోజు ఎట్టకేలకు ‘కింగ్డమ్’ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఫస్ట్ షో నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు ఊహించని స్థాయిలో వసూళ్లు వచ్చేస్తున్నాయి.

ఇది విజయ్ దేవరకొండ అభిమానుల కోసం నిజంగా పండగే అనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్‌బస్టర్ ఎట్టకేలకు ‘కింగ్డమ్’ రూపంలో వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ మంచి కంబ్యాక్ సాధించాడనే స్పందనలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే సినిమా హిట్ టాక్ అందుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న కూడా స్పందించింది. విజయ్ దేవరకొండకు అభినందనలు చెబుతూ ఒక ట్వీట్ చేసింది. ‘‘ఈ సక్సెస్ నీది మాత్రమే కాదు, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. మనం కొట్టినం..’’ అంటూ రాసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతకుముందు విజయ్ దేవరకొండ కూడా సినిమా రిజల్ట్‌పై స్పందించాడు. తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ‘‘నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోగలిగితే బాగుండు.. నాతో పాటు మీరందరూ ఈ విజయం అనుభవించగలిగితే బాగుండు.. వెంకన్న స్వామి దయ, మీ అందరి ప్రేమ.. నాకు ఇవే చాలు’’ అంటూ తన భావాలు షేర్ చేసుకున్నాడు.

మొత్తానికి.. ‘కింగ్డమ్’ విజయవంతంగా విజయ్‌కు కింగ్‌సైజ్ కంబ్యాక్ ఇచ్చింది. అభిమానుల ఆనందానికి హద్దులే లేవు!

Leave a Reply