ఆన్‌లైన్ లావాదేవీలను తరచూ చేసే వారిని ప్రభావితం చేసే కీలక మార్పులు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యూపీఐ యాప్‌లు వాడే వినియోగదారులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చిన ఈ మార్పులు UPI వ్యవస్థను మరింత వేగవంతం, భద్రతతో కూడినదిగా మార్చడమే లక్ష్యం.
🚨 [PART 1/2] New UPI rules from August 1.
NPCI is rolling out key changes to make digital payments safer and smoother. From daily balance check limits to fixed autopay slots and anti-fraud tweaks—here’s what you need to know.
For more news & updates, visit… pic.twitter.com/5Yb7JlWw5T
— Fortune India (@FortuneIndia) July 30, 2025
కొత్త నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి:
రోజుకు 50 సార్లే బ్యాలెన్స్ చెక్: ఇకపై ఒక్క యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగలరు.
అకౌంట్ లిమిట్: UPI యాప్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడవచ్చు.
ఆటోపే సమయ పరిమితి: EMIలు, సబ్‌స్క్రిప్షన్‌ల ఆటోపే లావాదేవీలు ఉదయం 10 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతాయి.
పెండింగ్ పేమెంట్ స్టేటస్: పెండింగ్‌లో ఉన్న లావాదేవీలను రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. వీటికి 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి.
12 నెలలుగా వాడని UPI IDలు ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతాయి.
ఈ మార్పులు సాధారణ యూజర్లకు పెద్ద ఇబ్బంది కలిగించకపోయినా, లావాదేవీల భద్రత, వేగం, విశ్వసనీయత పెంపుకు దోహదపడతాయి.