ఉద్యోగుల కోసం 30 నిమిషాల హస్తప్రయోగ విరామం.. స్వీడిష్ కంపెనీ విప్లవాత్మక నిర్ణయం!

ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించి ఉత్పాదకత పెంచేందుకు స్వీడన్‌కి చెందిన ఓ అడల్ట్ ఫిల్మ్ కంపెనీ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు ప్రతిరోజూ 30 నిమిషాల ‘హస్తప్రయోగ విరామం’ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘మాస్టర్బేషన్ స్టేషన్’ అనే గదిని ఆఫీసులో ఏర్పాటు చేశారు.

సాధారణంగా కొన్ని కంపెనీలు నిద్ర కోసం, మరికొన్ని గేమ్స్ కోసం విరామం కల్పిస్తుంటే.. ఈ కంపెనీ మాత్రం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి భిన్నంగా ఆలోచించింది. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, శారీరకంగా మరియు మానసికంగా హాయిగా ఉండేందుకు ఈ వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు.

కోవిడ్‌-19 సమయంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, కంపెనీ అధినేత్రి ఎరికా లస్ట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. మొదట ట్రయల్‌ రన్‌గా ప్రారంభించిన ఈ విధానం మంచి ఫలితాలు చూపించడంతో పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆఫీసులో ఏర్పాటు చేసిన ‘మాస్టర్బేషన్ స్టేషన్’ లో ఉద్యోగులు ఏకాంతంగా, ప్రశాంతంగా తమ విరామాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల పని తీరు మెరుగుపడుతుందని, ఫోకస్ పెరుగుతుందని, సంతృప్తి కూడా కలుగుతుందని ఎరికా వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొన్ని కోణాల్లో విమర్శలు వస్తున్నా.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కేంద్రంగా పెట్టుకుని తీసుకున్న ఈ చర్యను కొందరు స్వాగతిస్తున్నారు.

Leave a Reply