Rahul Gandhi: 22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. ఎవరు వారంటే?

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తాను కలిగిన మానవతా భావాన్ని మరోసారి చాటుకున్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది పిల్లల చదువుకి తానే బాధ్యత వహించనున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు.

ఈ చిన్నారులను జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతం నుంచి ఎంపిక చేశారు. తల్లిదండ్రులను కోల్పోయినా వారిని అనాథులుగా కాకుండా దేశ భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డిగ్రీ పూర్తయ్యే వరకు వారి విద్యా ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పారు. తొలివిడత ఆర్థిక సహాయాన్ని కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

మే నెలలో పూంచ్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, అక్కడి కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధిత చిన్నారుల వివరాలు సేకరించారు. ప్రభుత్వ రికార్డులను పూర్తిగా సరిచూసిన తర్వాతే 22 మంది పిల్లల జాబితాను ఖరారు చేశారు.

ఆ సమయంలో రాహుల్ గాంధీ క్రైస్ట్ పబ్లిక్ స్కూల్ ను సందర్శించారు. అక్కడ కూడా భారత్-పాక్ కాల్పుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు ఉన్నారు. వారిని కలిసి భరోసా ఇచ్చారు. సరిహద్దు ప్రాంతమైన పూంచ్‌లో పాఠశాలలపై తరచూ కాల్పులు జరగడం వల్ల అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో, రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply