Pawan Kalyan: 34 ఏళ్ల తర్వాత స్నేహితుడిని కలిసిన పవన్ కళ్యాణ్‌.. ఫొటోలు వైరల్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 34 ఏళ్ల తర్వాత తన చిరకాల స్నేహితుడిని కలుసుకున్నానని చెబుతూ, ఆ ప్రత్యేక క్షణాల్లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

1990లలో కోలీవుడ్ నటుడు, కరాటే గురువు షిహాన్ హుసైని దగ్గర మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్‌కి తోటి స్నేహితుడిగా ఉన్న తిరు రేన్షి రాజాను పవన్ ఇప్పుడు పరిచయం చేశారు. తమిళనాడుకు చెందిన రేన్షి రాజా, పవన్ గ్రీన్ బెల్ట్ పొందిన సమయంలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుతం రాజా ఆ కరాటే స్కూల్‌ను విజయవంతంగా నడుపుతున్నందుకు పవన్ అభినందనలు తెలిపారు. గురువు హుసైని బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఈ మార్చిలో మరణించిన విషయాన్ని కూడా పవన్ గుర్తు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

సినిమాల విషయానికి వస్తే, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నటనను ఆపలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు ప్రధాన చిత్రాలు ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సుజిత్ కాంబోలో రూపొందుతోన్న ఓజీ. ఓజీ షూటింగ్ పూర్తయింది. పవన్ వీలైనప్పుడల్లా ఉస్తాద్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు మాత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా నిలవలేకపోయింది. మొదటి రోజు రూ.34 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు రూ.8 కోట్లు మాత్రమే రాబట్టి దాదాపు 77% డిప్ చూసింది. మూడో రోజు రూ.9.25 కోట్లు, నాల్గవ రోజు రూ.9.86 కోట్లు వసూలు చేసి, నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.88.7 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక పేర్కొంది. అయితే సినిమాలో పూర్ వీఎఫ్ఎక్స్ సీన్స్‌పై విమర్శలు వచ్చాయి. దాంతో చిత్రబృందం కొన్ని సన్నివేశాలను తొలగించి మళ్లీ ఎడిటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో సినిమా నిడివి దాదాపు 15 నిమిషాలు తగ్గింది.

Leave a Reply