NTR WAR2: బాలీవుడ్‌లో ఎన్టీఆర్ సెన్సేషన్: ‘వార్ 2’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

‘RRR’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘వార్ 2’ ద్వారా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లోనే వీరిద్దరి కాంబినేషన్ మేజర్ హైప్‌ను క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ ఎంట్రీలోనే ఎన్టీఆర్ రూ. 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం. బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న ఒక నటుడికి తొలి సినిమాకే ఇచ్చిన అత్యధిక పారితోషికంగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌ వల్లే ఈ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్రబృందం వెనుకాడలేదట.

ఇక హృతిక్ రోషన్ విషయానికి వస్తే, ఆయనకు రూ. 48 కోట్లు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌తో పాటు, లాభాల్లో వాటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా బ్లాక్‌బస్టర్ అయితే హృతిక్ సంపాదన రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయినా సరే, ఫిక్స్‌డ్ పేమెంట్ పరంగా ఎన్టీఆర్ హృతిక్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు విశేషంగా చెప్పుకుంటున్నారు.

Leave a Reply