ప్రపంచంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆవిష్కరణలు రోజు రోజుకూ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇప్పుడు కొత్తగా చరిత్ర సృష్టించాలని సాంకేతిక రంగంలో తమ ప్రతిభను నిరూపించుకుంటోంది. అందుకు తాజా ఉదాహరణ బీహార్‌కు చెందిన అవనీష్ కుమార్. ఇతడు కేవలం రూ.7 వేల రూపాయలతో మినీ విమానం రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
-> 7000 రూపాయలతో విమానం తయారు చేసిన బీహార్ యువకుడు..
-> బీహార్‌లో వారంలోనే రూ. 7,000 ఖర్చు
-> కేవలం స్క్రాప్‌తో ఎగిరే విమానాన్ని తయారు చేసిన అవనీష్ కుమార్ అనే యువకుడు. #Bihar #avanishkumar #FLIGHT #innovative #Trending #TrendingNow @BJP4Bihar pic.twitter.com/C6jIQQVntN
— Rahul Agarwal (@AgarwalGrahul) July 28, 2025
అవనీష్‌కు ఎలాంటి ఇంజినీరింగ్ డిగ్రీ లేకపోయినా, తన సాంకేతిక నైపుణ్యంతో వాడుకలో లేని స్క్రాప్ మెటీరియల్‌తో ఈ విమానాన్ని తయారు చేశాడు. శాస్త్రీయ పద్ధతులు, సదుపాయాలు లేకపోయినా… ల్యాబ్ లేకపోయినా… తక్కువ ఖర్చుతో, స్వీయ డిజైన్‌తో అతను దీన్ని నిర్మించాడు. ఇదే కాదు, ఆ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
తాజాగా అతడు స్వయంగా తయారు చేసిన ఆ విమానాన్ని ఫ్లై చేశాడు. అది గాల్లో చక్కర్లు కొడుతుంటే అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అవనీష్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతడికి సరైన ప్రోత్సాహం అందితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశిస్తున్నారు.