ఫిడే మహిళల ప్రపంచకప్ 2025లో భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ ఘనవిజయం సాధించింది. ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని టై-బ్రేక్ గేమ్‌లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ (GM) హోదాను పొందిన దివ్య, భారత్ నుండి ఈ హోదా దక్కించుకున్న 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళగా నిలిచింది. అంతేకాదు, ఫిడే మహిళల ప్రపంచకప్ గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
Divya Deshmukh is the FIDE Women’s World Cup Champion. At the age of 19 !
She becomes the 88th GrandMaster of Indian.
Only the fourth Indian woman to achieve the title after Koneru Humpy, Harika Dronavalli, and Vaishali Rameshbabu.
Koneru Humpy finishes as runner-up. #Chess pic.twitter.com/PaBqlnUOjD— Ankhi Dutta (@ankhitweets) July 28, 2025
ఫైనల్ పోరాటం ఉత్కంఠగా సాగింది. మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రా కావడంతో విజేతను నిర్ణయించేందుకు టై-బ్రేక్‌లు అవసరమయ్యాయి. అందులో దివ్య అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. రెండో టై-బ్రేక్ గేమ్‌లో 75 ఎత్తుల్లో హంపిని ఓడించి తన దూకుడు చాటింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్లో తలపడడం విశేషం.
సెమీఫైనల్లో దివ్య మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీ (చైనా)ను ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది. చిన్న వయస్సులోనే అనేక అంతర్జాతీయ విజయం సాధించిన దివ్య, 2020లో FIDE ఆన్లైన్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. 2021లో ఆమె 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఫిడే ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుని భారత చెస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం రాసింది.